భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ క్రికెటర్ హర్షలే గిబ్స్ సంచలన ఆరోపణలు చేశాడు. బీసీసీఐ తనపై బెదిరింపులకు పాల్పడిదంటూ ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు. పాకిస్తాన్‌లో త్వరలో ప్రారంభం కానున్న కశ్మీర్ ప్రీమియర్ లీగ్ కేపీఎల్ 2021)లో ఆడకుండా బీసీసీఐ తనను అడ్డుకుంటోందని ఆరోపణలు గుప్పించాడు. ఒకవేళ కేపీఎల్ 2021లో ఆడితే.. భవిష్యత్తులో భారత్‌లో జరిగే క్రికెట్ టోర్నీలు సహా క్రీడా కార్యక్రమాలకు అనుమతించమని హెచ్చరికలు జారీ చేసిందంటూ ట్వీట్ చేశాడు. అయితే గిబ్స్ ఆరోపణలపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు.
#BCCI
#KPL2021
#HerschelleGibbs
#Cricket
#indvsPak
#IPL2021